ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 జూన్ 2024 (11:02 IST)

ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి ల రిసెప్షన్

Aishwarya Arjun  Umapathy  reception  Rajinikanth, iswrya and others
Aishwarya Arjun Umapathy reception Rajinikanth, iswrya and others
యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగిన  విషయం అందరికీ తెలిసిందే. కాగా జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్ లో సినీ, రాజకీయ అతిరధ మహారధుల సమక్షంలో  ఐశ్వర్య  అర్జున్ దంపతుల రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. 
 
CM Stalin blessings
CM Stalin blessings
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు సీఎం స్టాలిన్, హీరో రజనీకాంత్, ఉపేంద్ర, డైరెక్టర్  శంకర్,  ప్రభుదేవా, డైరెక్టర్  లోకేష్ కనక రాజ్, సత్యరాజ్ ,కుష్బూ, విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, తమిళనాడు బిజెపి అధ్యక్షులు అన్నామలై, స్నేహ రోజా, తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
 
Upendra and others
Upendra and others
ఐశ్వర్య అర్జున్ నటిగా  2013లో తమిళ సినిమా పట్టాతు యానై ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ్, కన్నడ, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. కాగా, 2023లో తెలుగులో సినిమాకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో అంగరంగ వైభవంగా ప్రారంభం జరిగింది. 
 
Aishwarya Arjun,  Umapathy family
Aishwarya Arjun, Umapathy family
విశ్వక్ సేన్ హీరోగా నటిసున్న ఈ సినిమాకు అర్జున్ దర్శకుడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఆశీస్సులు  అందించారు. కానీ కొద్దికాలానికే విశ్వక్ సేన్ సినిమా నుంచి తప్పుకున్నారు. దానిపై అర్జున్ స్ల బాధను తెలుపుటూ, విశ్వక్ సేన్  పై విమర్శలు చేశారు. ఆతర్వాత దానిపై విశ్వక్ సేన్ పెద్దగా స్పందించలేదు.