శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 జూన్ 2022 (17:34 IST)

చిలకలూరిపేటలో అఖండ రికార్డ్ సృష్టించింది

Akhanda record poster
Akhanda record poster
నంద‌మూరి బాల‌కృష్ణ‌కు చిలకలూరిపేటలోని అభిమానులు హ్యాపీ బర్త్ డే బాలయ్య అంటూ ఓ పోస్ట‌ర్ విడుద‌ల‌చేసి ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తెలుగు చ‌ల‌న చిత్ర‌రంగంలో బాల‌కృష్ణ అఖండ సినిమాతో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్ప‌టికే ఓటీటీలోనూ, ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్లోనూ ప్ర‌సారం అయిన అఖండ సినిమాను ఇంకా థియేట‌ర్‌లో ప్రేక్ష‌కులు చూడ‌డం విశేషం.
 
చిలకలూరిపేటలో ఇప్పటి వరకు ఏ సినిమాకు రాని అత్యధిక థియేటరుగా  అఖండ రికార్డ్ సృష్టించింది. స్థానిక రామకృష్ణ థియేటర్ --182 రోజులు,  KR థియేటర్ --52 రోజులు,  సాయికార్తీక్ థియేటర్  43 రోజులు ఆడింది.  మొత్తంగా చిలకలూరిపేట  టౌన్‌లో కంబైన్డ్ థియేట్రికల్ రన్ 310 రోజులు కావ‌డం విశేషం. బాల‌కృష్ణ‌కు గురువారంనాడు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఎగ్జిబిట‌ర్లు, పంపిణీదారులు, అభిమానులు పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.