బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (15:21 IST)

నేను వరల్డ్‌ సాలే అంటున్న ఏజెంట్‌ అఖిల్‌

Agent promo
Agent promo
అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్‌’. ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన స్టన్నింగ్‌ వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో రా ఏజెంట్‌గా అఖిల్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ మాఫియాకు పట్టుబడ్డ అఖిల్‌ను..ముసుగేసి కొడుతూ, ఈ నెట్‌వర్క్‌లో ఎవరు పంపాడ్రా.. అని అనగానే. ఒసామా బిన్‌ లాడెన్‌, గఢాఫీ, హిట్లర్‌ పంపాడు బే.. అంటూ అరడంతో సాలే బోల్‌ అంటూ. ఆ మాఫియా మేన్‌ విపరీతంగా కొడతాడు. వెంటనే సాలే నహీ. వరల్డ్‌ సాలే బోల్‌. అంటూ అఖిల్‌ అనడం ఈ వీడియో ప్రత్యేకత.
 
ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో ఏప్రిల్‌ 28న విడుదల చేస్తున్నట్లు డేట్‌ కూడా ఇచ్చేశారు. ఎకె ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు హిప్‌ హిప్‌ తమీజా సంగీతం అందించారు. చాలా గాప్ తర్వాత సురేందర్‌ రెడ్డి చేస్తున్న ఈ సినిమా పై అఖిల్ కు సురేందర్‌ రెడ్డికీ కీలకమైన సినిమా ఇది.