శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శనివారం, 12 నవంబరు 2022 (18:44 IST)

విజయ్ దేవరకొండ విడుదల చేసిన మసూద ట్రైలర్

masooda trailer poster
masooda trailer poster
‘మసూద’ ట్రైలర్ అద్భుతంగా ఉందని అన్నారు పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ.  ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
 
‘‘వాట్టే గ్రేట్ ట్రైలర్.. అద్భుతంగా ఉంది.. సూపర్బ్‌గా కట్ చేశారు. టీమ్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇలాంటి కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాత రాహుల్ యాదవ్‌‌గారికి ప్రత్యేకంగా నా అభినందనలు. వారి కలలు నిజం కావాలని కోరుకుంటున్నాను’’ అని ట్రైలర్ విడుదల చేసిన విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై తన ప్రేమను తెలియజేశారు.
 
ట్రైలర్ విషయానికి వస్తే.. భవిష్యత్ అనేది మనం ఈ రోజు ఏం చేస్తున్నామో అనేదానిపై ఆధారపడి ఉంటుంది.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్.. అడుగడుగునా ఆసక్తికరంగా ఉంది. తల్లికూతుళ్ల మధ్య ప్రేమ, మధ్య తరగతి కుటుంబాల బాధలు, స్నేహం, ప్రేమ వంటి అన్ని కోణాలను టచ్ చేస్తూ నడిచిన ఈ ట్రైలర్.. ఒక్కసారిగా హర్రర్ ఎలిమెంట్స్‌తో భయపెట్టేస్తోంది. ‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అస్సల్ భయం ముందుంది’ అని చిత్ర బృందం చెబుతున్న తీరు చూస్తుంటే..  హర్రర్ ఎలిమెంట్స్ జస్ట్ టచ్ మాత్రమే చేశామని చెప్పకనే చెప్పేశారు. ఇక పూర్తి స్థాయిలో భయపడేందుకు నవంబర్ 18 వరకు వెయిట్ చేయకతప్పదు. కాగా, ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్‌విసి బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు.  
 
సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు నటించిన ఈ చిత్రానికి
 బ్యానర్: స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్
 కళ: క్రాంతి ప్రియం, కెమెరా: నగేష్ బానెల్
 స్టంట్స్: రామ్ కిషన్ మరియు స్టంట్ జాషువా,  సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
 ఎడిటింగ్: జెస్విన్ ప్రభు, పిఆర్‌ఓ: బి.వీరబాబు
 నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా
 రచన, దర్శకత్వం: సాయికిరణ్