బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 నవంబరు 2022 (16:44 IST)

మసూద భయపెట్టబోతోంది: విజయ్ దేవరకొండ

Masood team with Vijay Deverakonda
Masood team with Vijay Deverakonda
‘‘వాట్టే గ్రేట్ ట్రైలర్.. అద్భుతం, చూస్తుంటే ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది..’’ అంటూ పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ రీసెంట్‌గా ‘మసూద’ ట్రైలర్ విడుదల సమయంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడీ సినిమా టీమ్‌కు తన సపోర్ట్ అందించారు. చిత్రటీమ్‌ని కలిసి వారితో కాసేపు సరదాగా ముచ్చటించి.. సినిమా విశేషాలను అడిగి తెలుసుకుని.. ‘మసూద’ సినిమాపై తనకున్న ప్రేమను తెలియజేశారు. 
 
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.  ‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అస్సల్ భయం ముందుంది’ అంటూ తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటుంది.
 
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘టీమ్‌లో చాలా మంది నాకు తెలుసు. చిత్ర హీరో తిరు.. నా ఫస్ట్ సినిమా అప్పటి నుంచి తెలుసు. నాతో పాటు అతను కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నగేష్ నా ‘పెళ్లిచూపులు’ సినిమా కెమెరామ్యాన్. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఓ షెడ్యూల్ అతను చేశాడు. నా ఉన్నతికి ఆయన కూడా ఓ ప్రధాన కారణం. అతనంటే నాకెంతో ఇష్టం. రాహుల్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాని మా నవీన్‌తో ప్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ కొత్త బంచ్‌తో ఈ సినిమా చేస్తున్నారు. సాయికిరణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం అంటే నాకెంతో ఇష్టం. నవంబర్ 18న ‘మసూద’ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. భయపెడుతుంది కూడా. ఈ మూవీ ట్రైలర్  నాకెంతో నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అందుకే నా ప్రేమ, అభినందనలు ఈ టీమ్‌కి ఇలా తెలియజేస్తున్నాను. అందరూ థియేటర్లలో ఈ సినిమాని చూడండి. ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను..’’ అని అన్నారు.
 
చాలా కాలం తరువాత తెలుగులో పూర్తి హారర్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్‌విసి బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు.