అంబానీ ఇంట గణేష పూజ.. ఎరుపు రంగు గులాబీలా మెరిసిన అలియా భట్
గణేష పూజ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం.. బాలీవుడ్ తార అలియా భట్ కాషాయ రంగు చీరలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. సూపర్ మిర్రర్ వర్క్‌తో సిద్ధం చేసిన ఎర్రటి చీరలో మెరుస్తూ కనిపించింది.
అంతేగాకుండా చీరకు తగినట్లు నారింజ రంగు లిప్‌స్టిక్, ఫ్రీ హెయిర్ స్టైల్, లైట్ మేకప్‌తో అదరగొట్టింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అపరకుబేరుడు ముఖేష్ అంబానీ నివాసంలో గణేష్ పూజ వేడుకల కోసం అలియా భట్ ఇలా ఎరుపు రంగు పువ్వులా మెరిసింది. హాజరైంది.
అలాగే నీతా అంబానీ-ముఖేష్ అంబానీల గ్రాండ్ గణేష్ పూజ వేడుకలకు హాజరైన అలియా భట్ ఓ వీడియోను కూడా నెట్టింట షేర్ చేసింది. ఈ వీడియోలో, అయాన్ ముఖర్జీతో కలిసి నటి ఫోజులిచ్చింది.