ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (12:47 IST)

తల్లి ఆశీర్వాదం తీసుకుని ఢిల్లీ లాండ్ అయిన అల్లు అర్జున్

Allu Arjun  mother's blessings
Allu Arjun mother's blessings
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం నార్త్ లో ఊహించని వసూళ్ళను రాబట్టింది. అక్కడ రిపోర్ట్ ను బట్టి అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అయిపోయాడు. కాగా, ఈరోజు అల్లు అర్జున్ ఢిల్లీలో ఫ్లెయిట్ దిగుతున్న ఫొటోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతకుముందు తన మాత్రుమూర్తి నిర్మల గారితో మాట్లాడుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభించింది. తల్లి ఆశీర్వాదం తీసుకుని ఢిల్లీ వెళ్ళిన ఐకాన్ స్టార్ అంటూ కితాబిస్తున్నారు.
 
ఇదిలా వుండగా, నేడు ఢిల్లీలో పుష్ప 2 సక్సెస్ మీట్ జరగనుంది. ఇందుకోసం చిత్ర టీమ్ ఇప్పటికే వెళ్ళింది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కూడా సెపరేట్ గా ఫ్లయిట్ లో వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా రిలీజ్ ముందు తన స్టామినాను తెలియజేసిన అల్లు అర్జున్ ఇప్పుడు 1000 కోట్ల గ్రాసింగ్ సినిమాగా నిలిచిన తర్వాత ఢిల్లీ వెళ్ళడం ప్రత్యేక సంతరించుకుంది. మరి ఇక్కడ ఎటువంటి స్టేట్ మెంట్ ఇస్తాడో ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.