బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 డిశెంబరు 2023 (13:15 IST)

రాంగోపాల్ వర్మ తల నరికేస్తే కోటి రూపాయలు: కేసు పెట్టాలంటూ RGV ట్వీట్

Ram Gopal Varma
రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ టీవీ ఛానల్లో బహిరంగంగా వ్యాఖ్యలు చేసారు అమరావతి ఉద్యమ నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో ఏపీ పోలీసులకు వర్మ ట్యాగ్ చేసారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. వ్యూహం పేరుతో వర్మ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, జగన్ పాత్రలను పోలి వుండే క్యారెక్టర్లను చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని గత నెల విడుదల చేద్దామని విశ్వప్రయత్నం చేసినా కొన్ని అడ్డంకులు తగిలాయి. దీనితో చిత్రం విడుదల కోసం గట్టిగా ప్రయత్నించి ఈ నెల 29న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
 
ఐతే ఈ చిత్రం ద్వారా తమ నాయకులపై బురద చల్లేందుకు వర్మ ప్రయత్నిస్తున్నారనీ ఆరోపిస్తున్నారు. పలువురు ఏకంగా వర్మ ఇంటి ముందుకు వెళ్లి ఆందోళనలు చేస్తున్నారు.