సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2023 (18:04 IST)

రాంగోపాల్ వర్మ వ్యూహం కు బ్రేక్ పడుతుందా?

Varama, dasari in vijayawada
Varama, dasari in vijayawada
రాంగోపాల్ వర్మసినిమాలంటే ప్రజలు ఆసక్తి చూపడంలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈతరం రకరకాలుగా పోస్ట్ లు పెడుతూ వర్మను ఒకరకంగా ఆడుకుంటున్నారు. అందుకే ఇటీవలే ఆయన సోషల్ మీడియాలో మాట్లాడుతూ, వ్యూహం చిత్రంలో చంద్రబాబునాయుడు కానీ పవన్ కళ్యాణ్, చిరంజీవి కానీ ఇలా కొన్ని పాత్రలుంటాయి. ఆ పాత్రలు వారి వ్యక్తిగతానికి సంబంధించినవి కావని క్లారిటీ ఇచ్చాడు. దీనితో వర్మ వర్షన్ మారినట్లు అయింది. అంతకుముందు జగన్ ను భుజాన మోస్తూ ఆయన ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడిన వర్మ సోషల్ మీడియాలో స్పందనలకు రూటు మార్చాడు.
 
కాగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం చిత్రం ప్రి_రిలీజ్ ఫంక్షన్ శనివారం విజయవాడ లో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షణకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియం కు వచ్చి పర్యవేక్సిస్తున్నారు. ఈ ఫంక్షన్ కు భారీ జనాలను తరలించే పనిలో వున్నారని తెలుస్తోంది.