1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (09:44 IST)

అన్నయ్యకు మైల్‌ స్టోన్‌లా అమిగోస్‌: ఎన్‌.టి.ఆర్‌.

NTR, Nandamuri Kalyan Ram
NTR, Nandamuri Kalyan Ram
మా అన్నయ్య మా ఫ్యామిలీలో ప్రయోగాత్మక సినిమాల్లో నటించే హీరో అయ్యాడు.. అని నందమూరి కళ్యాన్‌ రామ్‌ గురించి ఎన్‌.టి.ఆర్‌. తెలిపారు. కళ్యాణ్‌ రామ్‌ నటించిన అమిగోస్‌ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌.టి.ఆర్‌. మాట్లాడుతూ, ట్రైలర్‌ చూస్తుంటే దర్శకుడు రాజేందర్‌ రెడ్డి ఎంతో అద్భుతంగా తీసినట్లు కనిపిస్తుంది. అన్నయ్య కెరీర్‌లో ఈ సినిమా మైల్‌స్టోన్‌లా నిలవడం ఖాయం అని తెలిపారు. 
 
విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రిభిన‌యంలో న‌టించిన చిత్రం ‘అమిగోస్’.  రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది.