బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (17:03 IST)

ప్రతిభావంతులకు ఆనంద్ దేవరకొండ గం.. గం.. గణేశా టీమ్ ఆహ్వానం

Anand Devarakonda, Kedar Selagansetti, Vamsi Karumanchi, Uday Shetty
తెలుగు తెరపై నటీనటులుగా స్థిరపడాలని ఆశించే ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "గం..గం..గణేశా" టీమ్. టాలెంట్ ఉన్నవారికి నిజాయితీగా అవకాశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది "గం..గం..గణేశా" చిత్ర బృందం 
 
25 నుంచి 55 ఏళ్ల వరకు వివిధ పాత్రల కోసం నటులు, 18-20 ఏళ్ల ఒక పాత్రకు నటికి అవకాశం ఉంది. ఈ పాత్రలకు కావాల్సిన రిక్వైర్ మెంట్స్ ప్రకటనలో తెలిపారు. ఫొటోలు, వివరాలు [email protected] అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు. 7893058310 నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు. ఫిల్టర్ ఫొటోస్, టిక్ టాక్ వీడియోస్ పంపవద్దని, ఫోన్ కాల్స్ చేయొద్దని టీమ్ పేర్కొంది.
 
ఇటీవలే "గం..గం..గణేశా" చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
హై-లైఫ్ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది.