ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (18:13 IST)

ఆండ్రియా జెరెమియా యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నో ఎంట్రీ

Andrea Jeremiah,
Andrea Jeremiah,
నాలుగు కుక్కలు కలిస్తే ఏనుగునైనా ఎదిరిస్తాయి. అలాంటి కుక్కలకు ఓ వైరస్ ఎక్కిస్తే అవి ఏమి చేసాయి. వాటివల్ల ఎవరికీ ఉపయోగం అనే పాయింట్తో నో ఎంట్రీ చిత్రం రూపొందింది.  కోలీవుడ్‌లోని మల్టీటాలెంటెడ్‌ హీరోయిన్స్‌లో ఆండ్రియా జెరెమియా ఒక‌రు. ఆమె ఇప్పటివరకు ఫ్యామిలీ, లవ్, కామెడీ చిత్రాల్లో నటించింది. అయితే ఈ సారి ఆండ్రియా యాక్షన్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. అటవీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘నో ఎంట్రీ’  చిత్రంలో ఆమె సరికొత్త పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో  ఆండ్రియా ఎంతో సాహసంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ పాత్ర చేస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా  `నో ఎంట్రీ` మూవీ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు మేక‌ర్స్‌..
 
ట్రైల‌ర్‌ని గ‌మ‌నిస్తే..దట్టమైన అటవీ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్ళిన కొంత మంది స్నేహితులు అడవిలోని కొండ శిఖరంలో ఉన్న లగ్జరీ విల్లాలో బస చేస్తారు. ఆ ఇంటిని క్రూరమైన అడవి కుక్కలు చుట్టుముడతాయి. ఆ కుక్కల భారీనుండి వారు ఏ విధంగా తప్పించుకున్నారన్నదే ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఎంతో థ్రిల్లింగ్‌గా, రోమాలు నిక్కబొడుచుకునేలా ఇందులోని సన్నివేశాలను తెరకెక్కించినట్టు దర్శకుడు ఆర్‌. అళగు కార్తీక్‌ వెల్లడించారు. జంబో సినిమాస్‌ బ్యానరులో శ్రీధర్ అరుణాచ‌లం ఈ చిత్రాన్ని నిర్మించారు. అద‌వ్ క‌ణ్ణ‌దాస‌న్‌,ర‌న్య‌రావ్‌, మాన‌స్‌, జ‌య‌శ్రీ‌, జాన్‌వీ ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల‌కానుంది.