మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (09:36 IST)

శ్రీదేవి - శోభన్ బాబుతో తెలుగు తెరకు కేరళ అందం..

Gouri Kishan
Gouri Kishan
శ్రీదేవి - శోభన్ బాబు సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది గౌరీ కిషన్. జాను సినిమాలో మెరిసిన ఆమె.. చిరంజీవి పెద్ద కూతురు - అల్లుడు ఏర్పాటు చేసిన కొత్త బ్యానర్‌లో తెరకెక్కిన శ్రీదేవి శోభన్ బాబులో నటించింది. 
 
అలాంటి ఈ సినిమాకి ప్రశాంత్ దిమ్మల దర్శకత్వం వహించాడు. శ్రీదేవి - శోభన్ బాబు విలేజ్ నేపథ్యంలో నడిచే కథ. లవ్ డ్రామా జోనర్‌లో ఈ కథ నడుస్తుంది. సంతోష్ శోభన్ హీరోగా నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన విడుదల కానుంది.
 
ఇకపోతే.. కన్నడ.. మలయాళం.. తమిళ్ ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్‏లోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో కన్నడ సోయగం ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మరో కేరళ అందం గౌరీ కిషన్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.