గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (02:42 IST)

ఛాన్స్‌ ఇస్తే మంచివాళ్లు.. ఇవ్వకపోతే చెడ్డవాళ్లు అనుకునే టైప్‌ కాదట.. ఎవరు?

సంవత్సర కాలంలోనే మూడు సూపర్ హిట్ మూవీస్‌తో గోల్డెన్ గర్ల్ అని పేరు కొట్టేసిన ఈ పరమేశ్వరి సినిమా చాన్స్ ఇస్తే మంచోళ్లు ఇవ్వకపోతే చెడ్డోళ్లు అనుకునే టైప్ కాది నాది అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది

మొదట అ..ఆ.. తర్వాత ప్రేమమ్. తర్వాత ఫుల్ లెంగ్త్ మూవీ శతమానంభవతి.. కేవలం మూడంటే మూడు పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అమాంతం తనవైపు లాక్కున్న ఆ నీలి కురుల సుందరి తెలుగులో మాటలు బాగానే నేర్చనట్లుంది. సంవత్సర కాలంలోనే మూడు సూపర్ హిట్ మూవీస్‌తో గోల్డెన్ గర్ల్ అని పేరు కొట్టేసిన ఈ పరమేశ్వరి సినిమా చాన్స్ ఇస్తే మంచోళ్లు ఇవ్వకపోతే చెడ్డోళ్లు అనుకునే టైప్ కాది నాది అని బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. రామ్ చరణ్ వంటి పెద్ద హీరోతో సినిమాలో చాన్స్ వచ్చినట్లే వచ్చి చివరి నిముషంలో చేజారిపోవడంతో కాస్త షాక్ తిన్నా.. మెచ్యూరిటీ ప్రదర్శించి హుందాగా వైఫల్యాన్ని అంగీకరించడమే కాదు.. ఆ చిత్ర దర్శకుల మంచివారే అని కామెంట్ కూడా చేసి పాజిటివ్ మార్కులు కొట్టేసింది. 
 
రామ్‌చరణ్‌ సరసన నటించే ఛాన్స్‌ వచ్చినట్టే వచ్చి తప్పిపోయిన సందర్భాన్ని చాలా లైట్‌గా తీసుకుంది. అనుపమా పరమేశ్వరన్. ఆల్‌మోస్ట్‌ ఓకే అనుకుంటున్న సమయంలో చేజారిపోయింది. ఒక పెద్ద సినిమా మిస్‌ అయినప్పుడు బాధ ఉంటుంది. కానీ, ఏదీ మన చేతుల్లో ఉండదు కదా. ఆ సినిమా మిస్‌ అయినా ఆ చిత్ర దర్శక–నిర్మాతలతో నాకు మంచి అనుబంధమే ఉంది. రామ్‌చరణ్‌ మంచి పర్సన్‌. ఛాన్స్‌ ఇస్తే మంచివాళ్లు.. ఇవ్వకపోతే చెడ్డవాళ్లు అనుకునే టైప్‌ కాదు నేను. బాధను దిగమింగుకుని పరిస్థితులకు తిట్టుకోకుండా హుందాగా జరిగిన అనుభవాన్ని అంగీకరించడానికి ఎంత పరిణతి ఉండాలి? నాకింకా బోల్డంత కెరీర్‌ ఉంది. భవిష్యత్తులో చాలామంది హీరోలతో సినిమా చేసే ఛాన్స్‌ వస్తుంది. రామ్ చరణ్ తోనే కాదు అవకాశం వస్తే అందరితోనూ సినిమాలు చేస్తాను అంటూ ఆశావాదాన్ని వ్యక్తం చేసింది.
 
అలాగే ముచ్చటగా మూడు సూపర్ హిట్ సినిమాలతో గోల్డెన్ గర్ల్  గుర్తింపు తెచ్చుకోవడంపై సంతోషం వ్యక్తం చేసింది అనుపమ. అలాంటి గుర్తింపు రావడం పెద్ద బిరుదు. ఇందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ‘అఆ’, ‘ప్రేమమ్‌’లో చేసిన పాత్రల లెంగ్త్‌ తక్కువ అయినప్పటికీ మంచి పేరు తెచ్చాయి. దాంతో మనం సరైన నిర్ణయమే తీసుకున్నామనిపించింది. ‘శతమానం భవతి’ నన్ను ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా ప్రమోట్‌ చేసి, కెరీర్‌కి ప్లస్‌ అయింది.