శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (18:14 IST)

లైగర్‌ కొత్త లుక్‌పై దేవసేన రెస్పాన్స్..

Liger
లైగర్‌ కొత్త లుక్‌పై నటి అనుష్క శెట్టి స్పందించారు. విజయ్‌ దేవరకొండ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.
 
'లైగర్‌ చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నా. పూరీ సర్‌ మీ మ్యాజిక్‌ చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా. విజయ్‌.. ఈ సినిమా నీ కెరీర్‌లో బెస్ట్‌ కావాలి. ఎన్నో విభిన్నమైన కథలు మాకందిస్తున్న ఛార్మి, ఆ కథలు తెరకెక్కించడంలో భాగమైన కరణ్‌జోహార్‌కు ధన్యవాదాలు'' అని అనుష్క రాసుకొచ్చారు. 
 
ఇక అనుష్క చేసిన ఈ పోస్ట్‌పై విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ.. 'రెడ్‌ హార్ట్‌' సింబల్‌ను షేర్‌ చేశాడు. అలాగే నటి అనుష్కను ఇండస్ట్రీకి తొలిసారి పరిచయం చేసింది పూరీ జగన్నాథ్‌ అనే విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన 'సూపర్' సినిమాతోనే అనుష్క ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.