శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (16:45 IST)

రెట్టింపు అయిన బుగ్గలు... బొద్దుగా మారిన అనుష్క

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్ అనుష్క. బాహుబలి చిత్రం తర్వాత ఆమె హీరోయిన్‌గా నటించలేదు. నిజానికి బాహుబలి చిత్రంలోనే ఆమె కాస్త లావుగా కనిపించింది. ఆ తర్వాత ఆమె సన్నగా మారేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, ఫలితం దక్కలేదు. 
 
అయితే, జీరో చిత్రం కోసం ఆమె బొద్దుగా మారింది. ఆ తర్వాత సన్నగా మారేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయితే, ఇటీవ‌ల సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో ఆమెను నాజూకు సుందరిగా మార్చేశారు. తెల్ల‌ని డ్రెస్‌లో స్లిమ్‌గా ఉన్న అనుష్క‌ని చూసి అంద‌రు షాక్ అయ్యారు.
 
తాజాగా ఆమె ఎయిర్‌పోర్టులో కెమెరా కంటికి చిక్కింది. ఆమెను చూసిన అందరికీ షాక్ తగిలింది. మ‌ళ్ళీ బొద్దుగా సైజ్ జీరో లుక్‌నే గుర్తు చేసింది. ప్ర‌స్తుతం అనుష్క ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజులుగా నిశ్శ‌బ్ధం సినిమా కోసం అమెరికాలో ఉంటున్న అనుష్క రీసెంట్‌గా హైద‌రాబాద్‌కి వ‌చ్చింది. 
 
ఆమె తాజా చిత్రం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతుంది. మిగ‌తా భాష‌ల‌లో ఈ చిత్రాన్ని 'సైలెన్స్' పేరుతో విడుద‌ల చేయ‌నున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాసరావు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు.