ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (19:41 IST)

సినిమాను చూసి బాగోలేద‌ని అంటే గుండు గీయించేసుకుంటా: అన్వేషి హీరో విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల

ananya, varalaxmi and anewshi team
ananya, varalaxmi and anewshi team
విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ  శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వి.జె.ఖ‌న్నా ద‌ర్శ‌క‌త్వంలో టి.గ‌ణ‌ప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని న‌వంబ‌ర్ రెండో వారంలో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. నిర్మాత గణపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం అన్వేషి మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి నటి వరలక్ష్మి శ‌ర‌త్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

లిరిసిస్ట్ చైత‌న్య ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ఆర్‌.ఎక్స్ 100 నుంచి చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌తో నా అనుబంధం కొన‌సాగుతోంది. పిల్లా రా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమాలో మంచి పాట‌లు రాశాను. డైరెక్ట‌ర్ ఎంత ఇష్ట‌ప‌డి, క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా. వాళ్ల ప్యాష‌నేంటో నేను ద‌గ్గ‌ర నుంచి చూశాను. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ మాట్లాడుతూ ‘‘అన్వేషి ట్రైల‌ర్ బావుంది. విజువ‌ల్స్ చాలా బావున్నాయి. విజ‌య్‌కి ఆల్ ది బెస్ట్‌. అలాగే అన‌న్య‌, సిమ్రాన్‌ల‌కు అభినంద‌న‌లు. మ్యూజిక్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ చైత‌న్ భ‌రద్వాజ్ మాట్లాడుతూ ‘‘అన్వేషి మూవీ చాలా బాగా వచ్చింది. చాలా రోజుల తర్వాత మంచి థ్రిల్లర్‌ని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తార‌నటంలో సందేహం లేదు. పాటలు చాలా బాగా వ‌చ్చాయి. హార్ట్‌కు ట‌చ్ అవుతాయి. ఇప్ప‌టికే రిలీజైన రెండు పాట‌ల‌కు చాలా మంచి పాట‌లు వ‌చ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్‌ని సైమ‌న్‌గారు కంపోజ్ చేశారు. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోష‌న‌ల్ కంటెంట్ కూడా ఉంది. న‌మ్మిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు.

చిత్ర నిర్మాత టి.గ‌ణ‌ప‌తి రెడ్డి మాట్లాడుతూ ‘‘నిర్మాత‌గా ఇదే మా తొలి చిత్రం. నా భార్య పేరు మీద‌నే బ్యాన‌ర్‌ని స్టార్ట్ చేశాను. అన్వేషి క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చ‌తుంది. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంది. మా హీరో విజ‌య్ మంచి పెర్ఫామ‌ర్‌, డాన్స‌ర్‌. హీరోయిన్ సిమ్రాన్‌గారికి, అన‌న్య‌గారికి థాంక్స్‌. ఇదేం చిన్న సినిమా కాదు.. బాగానే ఖ‌ర్చు పెట్టి మేకింగ్ కోసం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. చాలా సినిమాల‌ను నిర్మించాల‌నే ఇక్క‌డ‌కు వ‌చ్చాను. మా డైరెక్ట‌ర్ వి.జె.ఖ‌న్నా సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. సెన్సార్‌కు సినిమా సిద్ధ‌మైంది. న‌వంబ‌ర్ రెండో వారంలో సినిమాను రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేశాం. అంద‌రూ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ చక్క‌టి మ్యూజిక్ ఇచ్చారు. ఇదే నెల‌లో అశ్విన్‌తో ఓ సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నాను. ప‌ద్మ‌నాభ‌రెడ్డిగారితో క‌లిసి ఆ మూవీని చేయ‌బోతున్నాను. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌గారితోనూ ఓ సినిమా చేస్తున్నాం. ఇలా ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డాల‌ని మా వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాం. మా ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు వి.జె.ఖ‌న్నా మాట్లాడుతూ ‘‘అన్వేషి ట్రైల‌ర్ కార్య‌క్ర‌మానికి చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన వ‌ర‌ల‌క్ష్మిగారికి థాంక్స్‌. అలాగే బ‌సిరెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌గారికి థాంక్స్‌. గ‌ణ‌ప‌తి రెడ్డి మా టీమ్‌కు స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డారు. ఆయ‌న క‌చ్చితంగా జెండా పాతేయ‌టానికి వ‌చ్చారు. నాలాంటి వాళ్ల‌కి ఇంకా చాలా మందికి ఆయ‌న అవ‌కాశాలు ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను. అలాగే మా కో ప్రొడ్యూస‌ర్స్‌కి థాంక్స్‌. మా కెమెరా మ్యాన్ కె.కె.రావుగారికి, ఆర్ట్ డైరెక్ట‌ర్ గాంధీగారికి స్పెష‌ల్ థాంక్స్‌. డీప్ ఫారెస్ట్‌లోకి వెళ్లి షూట్ చేశాం. ప్రేమ్ ర‌క్షిత్‌గారు ఇందులో ఓ పాట‌కు కొరియోగ్రఫీ అందించారు. వారితో పాటు విద్యాసాగ‌ర్‌గారికి ధ‌న్య‌వాదాలు. చైత‌న్ భ‌రద్వాజ్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. హీరో విజ‌య్‌, హీరోయిన్ సిమ్రాన్‌, ప్ర‌త్యేక‌ పాత్ర చేసిన అన‌న్య‌కు థాంక్స్‌. అన్వేషి సినిమా న‌వంబ‌ర్ రెండో వారంలో రానుంది. ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

అన‌న్య నాగ‌ళ్ల మాట్లాడుతూ ‘‘ముందు డైరెక్టర్ వి.జె.ఖన్నాగారు కథ నెరేట్ చేసినప్పుడు అలా డైరెక్ట్ చేస్తారా? అనుకున్నాను. కానీ రీసెంట్‌గా నేను ట్రైల‌ర్ చూసిన‌ప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. డైరెక్ట‌ర్‌గారు ప్ర‌తీ విభాగాన్ని చ‌క్క‌గా డిజైన్ చేసి మరీ తెర‌కెక్కించార‌ని అర్థ‌మైంది. ట్రైల‌ర్ అంద‌రికీ న‌చ్చే ఉంటుంద‌ని అనుకుంటున్నాను. మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. త‌ప్పకుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్మకంగా ఉన్నాం’’ అన్నారు.

హీరో విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల మాట్లాడుతూ ‘‘ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన మా అన్వేషి కంటెంట్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బ‌సిరెడ్డిగారి, వ‌ర‌ల‌క్ష్మిగారికి, ల‌క్ష్మ‌ణ్‌గారికి థాంక్స్‌. డెఫ‌నెట్‌గా అన్వేషి సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది. ఈ సినిమాను చూసి ఎవరైనా బాగోలేద‌ని అంటే గుండు గీయించేసుకుంటాను. ఈ జ‌ర్నీలో ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌ను ఫేస్ చేశాం. ఆ స‌మ‌యంలో టి.గ‌ణ‌ప‌తి రెడ్డిగారు దేవుడిలా అండ‌గా నిల‌బ‌డ్డారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ చ‌క్క‌టి ఔట్‌పుట్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన రెండు పాట‌ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. మిగిలిన పాట‌ల‌కు కూడా అంతే రేంజ్‌లో రెస్పాన్స్ వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నాం. మా డైరెక్టర్ వి.జె.ఖ‌న్నాగారు ముందు ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్‌తో స్టార్ట్ చేశారో, ఇప్ప‌టి వ‌ర‌కు అలాగే ఉన్నారు. సిమ్రాన్ గుప్తా మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్‌. అన‌న్య‌గారు ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో న‌టించారు.’ అన్నారు.