ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2024 (10:43 IST)

'ఇంద్ర' రీ రిలీజ్‌లోనూ రికార్డులు - ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్!

chiru movies
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా "ఇంద్ర" సినిమాను రీరిలీజ్​ చేశారు. ఈ చిత్రం రీ రిలీజ్​లోనూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకుంటోంది. ఈ సందర్భంగా 'ఇంద్ర' చిత్ర బృందాన్ని తన ఇంటికి పిలిచి మెగాస్టార్​ చిరంజీవి సన్మానించారు. ఈ వేడుకలో నిర్మాత అశ్వినీ దత్​, దర్శకుడు బి.గోపాల్​తో పాటు రచయితలు పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు మణిశర్మ, కథా రచయిత చిన్ని కృష్ణలు పాల్గొన్నారు. వీరందరికీ చిరు శాలువాలను కప్పి సన్మానించారు. అలానే అశ్వినీ దత్​కు ప్రత్యేకంగా పాంచజన్యాన్ని బహుమతిగా ఇచ్చారు. 
 
వైజయంతీ మూవీస్ బ్యానర్ లోగోపై సీనియర్​ ఎన్టీఆర్ కృష్ణుడి వేషధారణలో ఈ పాంచజన్యాన్ని పూరిస్తూ కనిపిస్తారు. అందుకే ఈ పాంచజన్యాన్ని బహుమతిగా ఇచ్చానని చిరంజీవి చెప్పారు. ఇక ఈ సన్మాన కార్యక్రమం పుర్తైన తర్వాత  అశ్వినీ దత్ 'ఇంద్ర', 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలకు సీక్వెల్స్ తీసుకొచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ రెండు సీక్వెల్స్ కోసం అభిమానులు ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, వీటికి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని వెల్లడించారు.