మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2023 (18:20 IST)

ఎన్‌.టి.ఆర్‌. గురించి ఆ దేవుడిని అడగాలి : కళ్యాణ్‌ రామ్‌

Kalyan Ram, Ishika
Kalyan Ram, Ishika
నందమూరి తారక రామారావుతో కలిసి మీరెప్పుడు సినిమా చేయనున్నారని విలేకరులు అడిగిన పశ్న్రకు నందమూరి కళ్యాణ్‌రామ్‌ దేవుడిపై భారం వేశారు. పైనున్న వాడే మన స్క్రీన్‌ప్లే రాస్తాడు. కథలు రాస్తాడు. అందుకే ఆయన్నే అడగాలంటూ సమాధానం చెప్పారు. బింబిసార సీక్వెల్‌లో ఎన్‌.టి.ఆర్‌ .పాత్ర వుంటుందని తెలిసింది. అనే విషయంలోనూ త్వరలో క్లారిటీ ఇస్తాను అని చెప్పారు.
 
కళ్యాణ్‌రామ్‌, ఇషిక జంటగా నటించిన సినిమా అమిగోస్‌. ఫిబ్రవరి 10న విడుదలకాబోతుంది. బింబిసారకు ఈ సినిమా కథకు తేడా ఏమిటి? అన్న దానికి ఆయన బదులిస్తూ.. బింబిసారలో రాజు సుప్రీం. తను వెరీ ఇగోయిస్ట్‌ పాత్ర. ఇక అమిగోస్‌లో వున్న విలన్‌ తను ఏమి అనుకుంటే అది కావాలి. జరిగి తీరాలి. అందులో మంచి చెడు అనేది చూడరు. ఇలాంటి తేడా వుందని చెప్పారు.
 
నాయిక ఇషిక గురించి చెబుతూ, తను మంచి నటి. డాన్స్‌ బాగా చేసింది. ఇక దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి మంచి కథ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్‌ దర్శకుడికే ఇస్తున్నా అన్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. 2023 ఏడాది తమకు కలిసి వచ్చింది అని అమిగోస్ కూడా హిట్ కొడుతుందని నిర్మాతలు తెలిపారు.