శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (17:21 IST)

20న 'భీమ్లా నాయక్' నుంచి మరో అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన… 'అయ్యప్పనుమ్‌ కోషియమ్‌'కు ఇది రీమేక్. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇపుడు తిరిగి ప్రారంభమైంది. 
 
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా 'భీమ్లా నాయక్' టైటిల్‌ను ప్రకటించి పవన్ ఫాన్స్‌లో ఊపు తెప్పించింది. అయితే భీమ్లా నాయక్ సినిమా నుంచి  తాజాగా మరో అప్డేట్ రాబోతోంది. 'ఇప్పటివరకు పవర్ తుఫాను చూశారు. 
 
ఇప్పుడు గెట్ రెడీఫర్... ఇవాళ సాయంత్రం 04;05  గంటలకు సిద్ధంగా ఉండండి' అంటూ ఓ సందేశాన్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత డేనియర్ శేఖర్ గురించి ఈ నెల 20వ తేదీన పోస్టర్ రిలీజ్ చేయనున్నట్టు అందులో పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.