గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (10:59 IST)

బిగ్ బాస్ హౌస్ నుంచి గాయని దామిని ఎలిమినేట్

singer damini
ప్రముఖ టీవీలో బిగ్ బాస్ ఏడో సీజన్ పోటీ సాగుతోంది. ప్రముఖ నటుుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి సింగర్ గాయని ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో ప్రియాంక జైన్, శుభశ్రీ, రతికా రోజ్, దామిని, ప్రిన్స్, యావర్, గౌతమ్ కృష్ణ, అమర్ దీప్‌లు నామినేషన్స్‌లో ఉండగా, చివరకు దామిని, శుభశ్రీ మిగిలారు. ఈ సందర్భంగా వీరిద్దరి  ఫోటోలను షిప్‌లపై అంటించి ఏది పేలితో వారు ఎలిమినేట్ అయినట్టు అని నాగార్జున ప్రటించారు. దీంతో దామిని ఫోటో అంటించిన షిప్ పేలిపోయింది. దీంతో ఆమెను ఎలిమిలేట్ అయినట్టుగా నాగార్జున ప్రకటించారు. 
 
సింగర్ దామిని ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించగా ప్రియాంక జౌన్, సందీప్ మాస్టర్‌లు తీవ్ర భావోద్వేగానిగి లోనయ్యారు. ఇదంతా గేమ్ అమ్మా... ఎమోషన్ అవ్వొద్దు అని శివాజీ హితవు పలికారు. అంతకుముందు స్కంద మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యువ కథానాయకుడు రామ్ పోతినేని బిగ్ బాస్ వేదికపై వచ్చి సందడి చేస్తూ హౌస్‌మేట్స్‌తో కలిసి డ్యాన్స్ వేశారు. 
 
హౌస్ నుంచి బయటకురాగానే దామిని మాట్లాడుతూ, 'ఎలిమినేషన్స్‌ను అస్సలు ఊహించలేదు. మరికొన్ని రోజులు హౌస్‌లో ఉంటానని అనుకున్నా. హౌస్‌లోకి వచ్చి మూడు వారాలే కావడంతో ఇంట్లో వాళ్లను వదిలేసి వచ్చానని ఫీలింగ్ కూడా నాలో ఇంకా కలగలేదు. మరికొన్ని రోజులు ఉంటానని అనిపించింది' అని దామిని చెప్పుకొచ్చింది.