శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (07:56 IST)

తమిళ నటి వనిత విజయకుమార్‌ మూడో భర్తకు గుండెపోటు.. ఆస్పత్రిలో అడ్మిట్!!

ఇటీవల వివాహం చేసుకున్న తమిళ సినీ నటి వనిత విజయకుమార్ మూడో భర్తకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ప్రముఖ విలక్షణ నటుడు విజయకుమార్ కుమార్తె, సినీ నటి, తమిళ బిగ్ బాస్ ఫేం వనితా విజయకుమార్ ఇటీవల మూడో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె భర్త పేరు పీటర్ పాల్. 
 
అయితే, ఈయన మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పీటర్‌పాల్‌ను ఆమె ఇటీవలే మూడో వివాహం చేసుకున్నారు. చాతీలో నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన వారికి వనిత కృతజ్ఞతలు తెలిపింది.
 
కాగా, వనిత మూడో వివాహం సినీ వర్గాల్లో పెను చర్చకు, వివాదానికి కారణమైంది. ఆమె మూడో పెళ్లిని నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్, నిర్మాత రవీంద్రన్‌ వంటివారు తప్పుబట్టారు. ఇది క్రమంగా ముదిరి ఆపై పోలీసు కేసుల వరకు వెళ్లింది. వనిత, లక్ష్మీరామకృష్ణన్‌లు పరస్పరం పరువునష్టం దావాలు కూడా వేసుకున్నారు.