ప్రైవేట్ కాంప్లెక్స్‌లో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు... ఎవరు?

suicide
ఠాగూర్| Last Updated: గురువారం, 12 నవంబరు 2020 (17:39 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దీపావళి పండుగకు ముందు ఓ విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు అసిఫ్ బాస్రా. ఈయన ధర్మశాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈయన వయసు 53 యేళ్లు.

గత కొన్ని రోజులుగా తీవ్రమైన డిప్రెషన్‌తో బాధ పడుతూ వచ్చిన ఆయన... మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బాలీవుడ్‌లో డిప్రెషన్ అనే పదం ఈ మధ్య చాలా వ్యాపిస్తుంది. జూన్ 14న స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కూడా డిప్రెషన్‌తోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు మరొక ప్రముఖ నటుడు కూడా ఇలాగే సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది.

కాగా, అసిఫ్ ఫ్యానుకు ఉరేసుకొని ఆసీస్ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ధర్మశాలలోని ఆ కాంప్లెక్స్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు మీడియాకు చెబుతామని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు తెలిపారు.

ఆసిఫ్ మరణవార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న నటులు దర్శకులు నిర్మాతలు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. ఒక అద్భుతమైన నటుడు ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అసలు ఊహించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.దీనిపై మరింత చదవండి :