శనివారం, 1 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : శనివారం, 1 మార్చి 2025 (15:29 IST)

Akhanda 2: అఖండ 2: తాండవం కోసం హిమాలయాల్లో బోయపాటి శ్రీను సర్వే

Akhanda 2: Thandavam
Akhanda 2: Thandavam
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ అఖండకు ఈ సీక్వెల్ యాక్షన్, ఇంటెన్స్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.
 
అఖండ 2: తాండవం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారు. హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో కొన్ని  ఎక్స్ ట్రార్డినరీ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ సన్నివేశాలు మూవీలో మెయిన్ హైలైట్ కానున్నాయి.
 
హై బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్‌లో సంయుక్త ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది. సంగీత సంచలనం ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు, సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ వంటి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు.
 
అఖండ 2 పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలోకి రానుంది.
 నటీనటులు: గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి