శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మే 2024 (12:16 IST)

Cannes 2024: రెడ్ కార్పెట్‌లో మెరిసిన అదితి రావ్ హైదరీ

Aditi Rao Hydari
Aditi Rao Hydari
కేన్స్ 2024లో భాగంగా రెడ్ కార్పెట్‌పై మోనోక్రోమ్ గౌనులో అదితి రావ్ హైదరీ అద్భుతంగా కనిపించింది. గురువారం ఐకానిక్ రెడ్ కార్పెట్‌పై అద్భుతమైన నలుపు, తెలుపు గౌనులో చక్కగా బన్ హెయిర్‌స్టైల్, సాధారణ మేకప్‌తో అదరగొట్టింది. 
 
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్‌లో నటి అదితి రావ్ హైదరీ ఫ్యాషన్ గోల్స్‌ని ప్రదర్శిస్తోంది. గురువారం, ఆమె బ్లాక్ అండ్ వైట్ గౌనులో ఐకానిక్ రెడ్ కార్పెట్ మీద నడిచింది. అదితి రావ్ హైదరీ హాఫ్‌ షోల్డర్‌ వైట్‌ అండ్‌ బ్లాక్‌ ఔట్‌ఫిట్‌తో రెడ్‌ కార్పెట్‌పై సందడి చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. మే 14వ తేదీన ప్రారంభమైన ఈ ఈవెంట్‌ 25వ తేదీ వరకూ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన సినీ ప్రముఖులు, డిజైనర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని రెడ్‌ కార్పెట్‌పై సందడి చేస్తున్నారు.