శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (16:35 IST)

ఒక రాత్రి గడిపితే అవకాశం దక్కుతుందని అన్నారు... నటి ప్రగతి

తెలుగు చిత్రపరిశ్రమలో వివిధ రకాలైన పాత్రలను పోషిస్తూ మంచి గుర్తింపు సంపాదించున్న నటి ప్రగతి. ఇటీవలి కాలంలో ఈమె చేస్తున్న వ్యాయామఫీట్లు ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సినిమా కెరీర్‌ను ప్రారంభించినపుడు అనేక మంది దర్శక నిర్మాతల వద్దకు వెళ్లగా, ఒక రాత్రి గడిపితే అవకాశం దక్కుతుందని అన్నారని చెప్పారు. తద్వారా తెలుగు చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె చెప్పకనే చెప్పారు.
 
కేవలం ఒక్క దర్శక నిర్మాతలే కాదు ఓ స్టార్ హీరో కూడా తనను వేధించారని చెప్పారు. ఆయన చిత్రంలో సినిమా అవకాశం కావాలంటే తనతో పాటు దర్శకనిర్మాతలతో ఒక రాత్రి గడపాలని చెప్పారని తెలిపారు. కానీ, తాను దేనికీ తలవంచలేదన్నారు. 
 
చిత్రపరిశ్రమలో చాలా మంది మహిళా కళాకారులు ఇలాంటి వేధింపులే ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే, అవకాశా
ల కోసం తలవంచితే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అన్నారు. ప్రతిభ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పేందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు.