ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (16:05 IST)

వైరముత్తు ట్వీట్‌కు ఫైర్ అయిన చిన్మయి.. వీళ్ల గోల ఇంకా..?

డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్‌కు మద్దతుగా రచయిత వైరముత్తు చేసిన ట్వీట్‌పై గాయని చిన్మయి ఫైర్ అయ్యింది. తమిళనాడుకు స్టాలిన్ సీఎంగా రావాలని ఆశిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడేంటి.. అన్నట్టు చిన్మయి ట్వీట్ చేసింది. స్టాలిన్ ప్రభుత్వం రావాలని కవిత రూపంలో వైరముత్తు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చిన్మయి ఫైర్ అవుతూ రీ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
గత ఏడాది వైరముత్తు తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారంటూ చిన్మయి తెలిపింది. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. చిన్మయికి పలువురు మద్దతు పలికారు. ఈ వ్యవహారంపై ఇప్పుడిప్పుడే చర్చ ఆగిందనుకుంటే వైరముత్తు చిన్న పనిచేసినా.. చిన్మయి అందుకు సమాధానం ఇవ్వడం మామూలైపోయింది. వీరి ట్వీట్లు చూసిన నెటిజన్లంతా.. వీరి గోల ఇంకా ఆగలేదా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.