సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (10:01 IST)

ప‌ద్మ‌శ్రీ చింత‌కింది మ‌ల్లేశం బ‌యోపిక్ ఫ‌స్ట్ లుక్... ఎవ‌రీ చింత‌కింది మ‌ల్లేశం..?

ప‌ద్మశ్రీ చింత‌కింది మ‌ల్లేశం జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న సినిమా మ‌ల్లేశం. అగ్గిపెట్టెలో ప‌ట్టేంత చిన్న చీర‌ల‌ను కూడా నేచి ప్రపంచాన్ని అబ్బుర పరిచిన వ్యక్తి మల్లేశం. తను సాధించిన విజయాలతో చేనేత ప్రాముఖ్యతను దేశవ్యాప్తంగా చాటి చెప్పిన ఘ‌న‌త మ‌ల్లేశం గారి సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తి జీవితం ఆధారంగా మ‌ల్లేశం సినిమా తెర‌కెక్కుతుంది. 
 
రాజ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా.. శ్రీ అధికారి, రాజ్ ఆర్ నిర్మిస్తున్నారు. ఇందులో మ‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి నటిస్తున్నారు. అన‌న్య‌, ఝాన్సీ, చక్ర‌పాణి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌లో ఉంది. చిత్ర‌ యూనిట్ సిరిసిల్ల జిల్లాలో ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసారు. బాబు శాడిలాస్య ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఆలే ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. 
 
విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న సౌండ్ డిజైన‌ర్ నితిన్ లుకోస్ ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ ఈ చిత్రానికి మాట‌లు రాస్తున్నారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత గోరేటి వెంక‌న్న, చంద్ర‌బోస్ ఈ చిత్రానికి పాట‌లు రాస్తున్నారు. వెంక‌ట్ సిద్ధిరెడ్డి ఈ చిత్రానికి ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ఉన్నారు.