గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (12:29 IST)

మా ఊరి హీరో కృష్ణంరాజు : మెగాస్టార్ చిరంజీవి

Chiranjeevi
మా ఊరి హీరో కృష్ణంరాజు అంటూ మెగాస్టార్ చిరంజీవిన తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు. కృష్ణంరాజు ఇకలేరన్న మాట ఎంతో విషాదకరంగా ఉందన్నారు. తొలి రోజుల నుంచి పెద్దన్నలా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారని తెలిపారు. పైగా, రెబెల్ స్టార్‌కు నిజమైన నిర్వహచనంలా నిలిచారన్నారు. ఆదివారం తెల్లవారుజామున కృష్ణంరాజు కన్నుమూశారు. ఆయన మృతిపై చిరంజీవి తన సంతాప సందేశాన్ని విడుదల చేశారు.
 
"కృష్ణంరాజు గారు ఇక లేరు అనే మాట ఎంతో విషాదకరం. మా ఊరి హీరో, చిత్ర పరిశ్రమలో తన తొలి రోజుల నుంచి పెద్దన్నలా ఆప్యాయంగా ప్రోత్సహించారు. ఆయనతో నా అనుబంధం 'మనవూరి పాండవులు' దగ్గర నుంచి నేటి వరకు తన అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. 
 
'రెబల్ స్టార్'కి ఆయన నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా తనకు, సినీ పరిశ్రమకు, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, తన తమ్ముడి లాంటి ప్రభాస్‌కు సంతాపాన్ని తెలియజేస్తున్నా" అని ట్వీట్ చేశారు.