చిరు సైరా విడుదలకు ముహుర్తం కుదిరిందా..?
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ సైరా నరసింహారెడ్డి. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన రామ్ చరణ్ ఏమాత్రం రాజీపడకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
చిరు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సంచలన సినిమాని ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మూవీ దసరాకి రిలీజ్ కానుందా..? సంక్రాంతికి రిలీజ్ కానుందా..? అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు.
ఇటీవల రామ్ చరణ్ వినయ విధేయ రామ ప్రమోషన్‌లో భాగంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైరా గురించి మాట్లాడుతూ.. దసరాకి రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు కానీ.. ఆ తర్వాత సైరా సంక్రాంతికి రిలీజ్ కానుంది అని వార్తలు వచ్చాయి.
ఇదిలావుంటే.. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో సైరా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మార్చి చివరకు లేదా ఏప్రిల్ నెలాఖరు లోపు మొత్తం షూటింగ్ వర్క్ పూర్తవుతుందని తెలిసింది. దసరాకు రిలీజ్ అనుకుంటే ఇంకా ఆరు నెలలు టైమ్ వుంటుంది. సిజి వర్క్‌కు, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఇది సరిపోతుంది కాబట్టి దసరాకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి.. అనుకున్నట్టుగా దసరాకి థియేటర్ లోకి వచ్చేస్తాడో లేక సంక్రాంతికి వస్తానంటాడో చూడాలి.