గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 డిశెంబరు 2021 (11:42 IST)

నా బాడీ పార్ట్స్‌పై ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు..

Chris Noth
'సెక్స్ అండ్ ది సిటీ' సిరీస్ ద్వారా మంచిపేరు సంపాదించిన ప్రముఖ హాలీవుడ్ సీనియర్ యాక్టర్ క్రిస్ నోత్.. తనను రేప్ చేయడానికి ప్రయత్నించాడని స్టార్ సింగర్ లిసా జెంటిట్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఈ ఘటన 2002లో జరిగిందని.. కానీ ఈ విషయాన్ని బయటపెడితే తన కెరీర్ నాశనం చేస్తానని క్రిస్ బెదిరించినట్లు ఆరోపించింది. "న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్రిస్‌ను నేను ఓ బిజినెస్ పని మీద కలిశాను.
 
రాత్రి అతడు నన్ను రెస్టారెంట్‌ నుంచి ఇంటిదగ్గర డ్రాప్‌ చేశాడు. ఇక నేను మీ ఇల్లు చూస్తాను అని లోపలికి వచ్చిన ఆయన.. వెంటనే నన్ను బలవంతంగా తనదగ్గరకు లాక్కుని.. నా బాడీ పార్ట్స్‌పై ముద్దులు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
నేను వద్దు వద్దు అన్న వినకుండా నా చేతిని ఆయన షర్ట్ లోపలికి పెట్టి అభ్యంతరకరంగా బిహేవ్ చేసాడు. దీంతో నేను ఘట్టిగా అరుస్తుంటే.. నన్ను బూతులు తిట్టాడు. నేను నా బలాన్నీ ఉపయోగించి అతడిని తోసేశాను. 
 
అప్పుడు ఆయన ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడు. అందుకే ఈ విషయం ఎవ్వరికి చెప్పలేదు. ఇప్పుడు వేరే వాళ్లు కూడా అయన పై కెసు పెట్టడంతో నాకు ధైర్యం వచ్చి నేను జరిగింది చెప్పుతున్నాను." అంటూ చెప్పుకొచ్చింది.