గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 26 జనవరి 2022 (17:32 IST)

సుందరాంగుడు విడుదలకు సహకరించండి - హీరో కృష్ణసాయి

hero Krishnasai
ఏ.వి.సుబ్బారావు సమర్పణలో ఎమ్‌.ఎస్‌.కె. ప్రమీద శ్రీ ఫిలిమ్స్‌ పతాకంపై కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ నటీనటులుగా వినయ్‌బాబు దర్శకత్వంలో చందర్‌గౌడ్‌, యం.యస్‌.కె. రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘సుందరాంగుడు’. వినూత్న ప్రేమకథ తో  రూపొందిన ఈ సినిమా సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 న హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌లో  ‘సుందరాంగుడు’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కృష్ణసాయి మాట్లాడుతూ... ఈ కోవిడ్‌ కారణంగా మీడియా సమక్షంలో మా చిత్ర ట్రైలర్‌ విడుదల చేయడం జరిగింది. ఈ బ్యానర్‌లో నేను, చంద్రగౌడ్‌ గారు రెండు సంవత్సరాలు కష్టపడి సినిమాను పూర్తి చేశాం. 7 పాటలు ఉన్నాయి. అందులో ఒక డీజే సాంగ్‌ ఉంది. అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు ‘సుందరాంగుడు’ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఫుల్‌లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా విడుదలకు మీరందరూ సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాను. మాకున్న కృష్ణ సాయి చారిటబుల్‌ ట్రస్టు తరఫున చాలామందికి హెల్ప్‌ చేస్తున్నాము. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలను కూడా మా ట్రస్ట్‌ ద్వారా హెల్ప్‌ చేయడం జరుగుతుంది.ఈ మధ్య సింగర్‌ జై శ్రీనివాస్‌ చనిపోవడం దురదృష్టకర సంఘటన. వాళ్ల ఫ్యామిలీని కలిసి మాకు తోచిన సహాయం చేశాం. మా సినిమా సెన్సార్‌ పూర్తి అయి  నాలుగు నెలలైంది. థియేటర్స్‌ దొరికినా వాటి రెంట్‌, క్యూబ్స్‌కు డబ్బు కట్టటానికి ఇబ్బంది అవుతోంది. మాకు సపోర్ట్‌ లేక సినిమా రిలీజ్‌ చేసుకోలేకపోతున్నాను. ఇలా ఎంతో మంది నిర్మాతలు సినిమా రిలీజ్‌ విడుదల చేసుకో లేక ఇబ్బంది పడుతున్నారు. దయచేసి చిన్న సినిమాల విడుదలకు పరిశ్రమ పెద్దలు సపోర్ట్‌ చేయాలని కోరుతున్నాను.
     
నటీనటులు:
కృష్ణసాయి, మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ ,జీవా, భాషా, అమిత్‌ తివారి, జూనియర్‌ రేలంగి, మిర్చి మాధవి తదితరులు.