శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Modified: గురువారం, 31 డిశెంబరు 2020 (16:05 IST)

ఆయుర్వేదంతో కరోనాని జయించవచ్చు: అల్లు శిరీష్

ఆ మధ్య కాస్త తగ్గినట్లు కనిపించినా కరోనా వైరస్ ఈ మధ్య మళ్ళీ పెరుగుతుంది. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, వరుణ్ తేజ్ కూడా కరోనా బారిన పడ్డారు. దాంతో ఇప్పుడు అల్లు శిరీష్ కూడా టెస్ట్ చేయించుకున్నారు. ఇదే విషయంపై ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దాంతో పాటు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆయన సూచించారు.
 
"నేను రెండుసార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నాను.. రిజల్ట్ నెగిటివ్ వచ్చింది.. మన ఆరోగ్యం కోసం నేను ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నేను పెళ్ళికి వెళ్ళాను.. బయట తిరిగాను.. 100 మందితో కలిసి షూటింగ్ చేశా.. కానీ వాటి కంటే ముందు కరోనాకు జాగ్రత్తలు పాటించాలి. నేను తప్పకుండా మాస్కు పెట్టుకున్నాను.. శానిటైజర్ క్రమంతప్పకుండా వాడాను.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు రాకుండా ఉండటం అనేది అసాధ్యం. మనకు మనమే జాగ్రత్తలు పాటించాలి.
 
నా విషయంలో కొంత అదృష్టం మరికొంత ఆయుర్వేదం నన్ను ఆరోగ్యంగా ఉంచుతుంది అనుకుంటున్నాను. మనం ఈ ప్రపంచంలో ఇతర జీవరాశులతో కలిసి ఎన్నో వందల సంవత్సరాలుగా జీవిస్తున్నాం. ఆ జీవరాశుల నుంచి వచ్చే సమస్యలతో మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలి అని ఈ విషయం గురించి ఎన్నో ఏళ్ళ కింద మన పురాణాల్లోనే పరిష్కారం చూపించారు.
 
వ్యాక్సిన్ వచ్చేవరకు మాస్కులు, శానిటైజర్లతో పాటు మన సాంప్రదాయ పద్ధతులను కూడా ఫాలో అవ్వండి. ఆయుష్ క్వాతా, మృత్యుంజయ, చ్యవన్‌ప్రాస ఇవన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్. సనాతన ధర్మాలు, ఆయుర్వేదం మన తాతముత్తాతలు మన ప్రపంచానికి ఇచ్చిన అతిపెద్ద బహుమతులు. వీటిని పాటించి అందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉందాం.." అని ట్వీట్ చేశారు.