సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By జె
Last Modified: బుధవారం, 30 డిశెంబరు 2020 (21:10 IST)

ఎపిని వణికిస్తున్న స్ట్రెయిన్ కరోనా, తూర్పుగోదావరి జిల్లాలో?

కరోనా తగ్గుముఖం పడుతోందనుకుంటున్న సమయంలో స్ట్రెయిన్ కరోనా తెలుగు రాష్ట్రాల ప్రజలను వణికిస్తోంది. ఇప్పటికే యుకె నుంచి చాలామంది రావడం.. వారికి కరోనా లక్షణాలు ఉండటం, వారికి పరీక్ష చేయడంతో కొంతమంది స్ట్రెయిన్ కరోనా అని తేలడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మరింత భయాందోళన వ్యక్తమవుతోంది.
 
ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామక్రిష్ణ నగర్‌కు చెందిన మేరీకి కొత్త స్ట్రెయిన్ నిర్థారణ అయ్యింది. ప్రైమరీ కాంటాక్ట్‌గా ఉన్న కొడుక్కి నెగిటివ్ వచ్చింది. యుకె నుంచి వచ్చిన వారిలో 114 మందిలో 111 మందికి పరీక్షలు నిర్వహిస్తే ఇద్దరు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
 
కాకినాడ వెంకటనగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్.. ప్రైమరీ కాంటాక్ట్‌లో మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యంది. ఈ కేసులు మొత్తం స్ట్రెయిన్ కరోనాగా నిర్థారణ కావడంతో తెలుగు ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.