శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (13:06 IST)

'ఆచార్య' రిలీజ్ తేదీపై కీలక ప్రకటన చేసిన మూవీ మేకర్!

మెగాస్టార్ చిరంజీవి - సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే, హీరో రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. 
 
సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈసినిమా కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. గ‌త ఏడాది లాక్డౌన్ వ‌ల‌న వాయిదా ప‌డిన ఈ చిత్రాన్ని మే 13న రిలీజ్ చేస్తామ‌ని కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించారు. 
 
అయితే, ప్రస్తుతం దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభించ‌డం, షూటింగ్స్ ఆగిపోవ‌డం, ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు త‌ల‌కిందులు కావడంతో మూవీ మ‌ళ్లీ వాయిదా ప‌డింది. కొద్ది రోజులుగా 'ఆచార్య' చిత్రం వాయిదా ప‌డుతుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో కొద్ది సేప‌టి క్రితం మేక‌ర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. 
 
"క‌రోనా వ‌ల‌న చిత్రాన్ని మే 13న విడుద‌ల చేయ‌డం లేదు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక కొత్త తేదీని ప్ర‌క‌టిస్తాం" అని మేక‌ర్స్ తెలియ‌జేశారు. క‌రోనా వ‌ల‌న నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’, విశ్వక్‌సేన్‌ ‘పాగల్’‌ రిలీజ్‌లు వాయిదా ప‌డ్డ విష‌యం తెలిసిందే.