గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 8 జూన్ 2020 (18:51 IST)

హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్ షిప్` ఫ‌స్ట్‌లుక్‌కి క్రికెట‌ర్ శ్రీశాంత్ ప్ర‌శంస‌లు

ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న 'ఫ్రెండ్ షిప్` సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలై దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రాబట్టింది. హర్భజన్ సింగ్ ట్విట్ట‌ర్లో షేర్ చేసిన ఫ‌స్ట్‌లుక్‌ని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించిన విష‌యం తెలిసిందే.
 
తాజాగా టీమ్ ఇండియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్ శ్రీ‌శాంత్ 'ఫ్రెండ్‌షిప్` సినిమాపై స్పందిస్తూ` ఆల్ ద వెరీ బెస్ట్ భ‌జ్జీ.. పోస్ట‌ర్ చూశాను చాలా బాగుంది. నువ్వు కొట్టే సిక్సులు లాగే మూవీ కూడా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది` అని ట్వీట్ చేశారు. ఈ ప్ర‌ముఖ క్రికెట‌ర్స్ ట్వీట్ల‌తో సినిమా మీద భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.
 
త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రల‌లో యాక్షన్ కింగ్ అర్జున్, త‌మిళ న‌టుడు స‌తీష్‌ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ‌, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేస్తున్నారు.