గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (12:19 IST)

మొబైల్ యాప్ అనే కొత్త కాన్సెప్ట్ తో డాన్ 360

Don 360- Srikanth Iyengar, Archana, Priya Hegde
Don 360- Srikanth Iyengar, Archana, Priya Hegde
మొబైల్ యాప్ తో రౌడీలను బుక్ చేసుకోవచ్చు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ఫుల్ యాక్షన్ ప్యాక్ మూవీ గా డాన్ 360 చిత్రం ముందుకు రాబోతుంది.  దీనికి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్లో మూవీ టీం పాల్గొని మూవీ మంచి సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాము అన్నారు. మా సినిమా కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగర్, అర్చన అనంత్, సతీష్ సారిపల్లి కి కృతజ్ఞతలు తెలిపారు.
 
 
ఈ సందర్భంగా దర్శకుడు, హీరో భరత్ కృష్ణ మాట్లాడుతూ : ఒక కొత్త కాన్సెప్ట్ తో నేను రాసుకున్న కథని నీ ముందు తీసుకొస్తున్నాను చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఉంటే కచ్చితంగా ఆశీర్వదిస్తారు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. కథ చెప్పగానే నచ్చి మా ఈ సినిమాని ప్రోత్సహించి ఈ సినిమాలో నటించిన శ్రీకాంత్ అయ్యంగర్ గారు, అర్చన అనంత్ గారు మరియు సారిపల్లి సతీష్ కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
 
హీరోయిన్ ప్రియా హెగ్డే మాట్లాడుతూ : డైరెక్టర్ కాదో చెప్పినప్పుడు ఎంతో ఎక్సైటింగ్ అనిపించింది. కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు రాబోతున్నాం మీరు సపోర్ట్ ఎప్పుడూ కావాలని కోరుకుంటున్నాము అన్నారు.
 
సతీష్ సారిపల్లి మాట్లాడుతూ : భరత్ కృష్ణ చెప్పిన కథ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. కొత్తగా డైరెక్షన్ చేస్తున్న కొత్త డైరెక్టర్ అన్నట్టు కాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడి లాగా సినిమా తీశాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు మంచి సినిమాను ఆదరిస్తారు అలాగే ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.\