గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (14:12 IST)

రామన్న యూత్ సినిమాలో అభయ్ నవీన్ ఏమి చెప్పాడంటే! రివ్యూ

Ramanna Youth
Ramanna Youth
అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన  ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది.  అమూల్య రెడ్డి కథానాయిక. తాగుబోతు రమేష్, అనిల్ గీలా, శ్రీకాంత్ అయ్యంగార్, విష్ణు.. తదితరులు మిగిలిన తారాగణం. ఈరోజే విడుదల అయింది. ఎలావుందో చూద్దాం. 
 
కథ.
తెలంగాణలోని ఓ గ్రామం. ఊరి సర్పెంచ్ తాగుబోతు రమేష్ ఓ రాజకీయ పార్టీ ప్రతినిధి. ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ అయ్యంగార్. ఊరిలో బేవార్స్ గా తిరుగుతూ తల్లి తండ్రులకు తలనొప్పిగా మారే నలుగురు కుర్రాళ్లు సర్పెంచ్ అనుచరులు. ఎమ్మెల్యే ఊరికి వచ్చి మీటింగ్ పెడితే హడావుడి అంతా వీరిదే. సర్పెంచ్ కింద పనిచేసే ఈ నలుగురు ఆయనకు తెలీకుండా దసరా  పండగకి ఊర్లో ఎమ్మెల్యే ఫోటో పక్కన వీరి ఫొటోలతే ప్లెక్సీ వేసి హడావుడి చేస్తారు.

దాన్నీ సర్పెంచ్ సీరియస్ గా తీసుకోడు. కానీ సర్పెంచ్ తమ్ముడు తన ఫోటో లేదని ఇగో హార్ట్ అయి ఆ నలుగురిని టార్గెట్ చేస్తాడు. ఇది  తెలిసుకున్న ఆ నలుగురు ఓరోజు  దావత్ కు  సర్పెంచ్ తమ్ముడ్ని పిలిచి మత్తులో అవమానిస్తారు. మాట మాట పెరిగి సర్పెంచ్ తో పనిలేకుండా ఎమ్మెల్యే ను కలిసి పార్థి యూత్ లీడర్ గా కండువా కప్పించుకుంటామని ఆ నలుగురు సవాల్ విసురుతారు. ఆ తర్వాత ఏమైంది? అనేది మిగిలిన కథ. 
 
సమీక్ష:
ఇటీవల తెలంగాణ కథలు వెండి తెరపై అలరిస్తున్నాయి. అందులో జాతి రత్నాలు ఒకటి. ఇప్పడు ఇంచుమించు ఆ తరహాలోనే ఎంటర్ టైన్ విధంగా రామన్న యూత్ అనుకోవచ్చు. ఇక తెలంగాణ కథలు అంటే యూత్  కు ఆవేశం, తాగుడు, చిందులు, ఉట్టి కెక్కే యూత్ ఆలోచనలు మెండుగా ఉంటున్నాయి. వారి యాస కొత్తగా అనిపిస్తుంది. యూత్ నలుగురు ఎం.ఎల్.ఏ. ప్రాపకం కోసం ఏమిచేసారు అనేది ఎంటర్ టైన్ గా తీశారు.  హీరో, అతని ఫ్రెండ్స్ చేసే కామెడీ వర్కౌట్ అయింది. హీరోకి లవ్ ఉన్నా కథలో అంతగా ఇంపార్టెన్స్ అనిపించదు.

ఇక ఊళ్ళల్లో జనాలు ఎలా ఉంటారు, అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది చాలా బాగా చూపించారు. హీరోగా చేస్తూనే డైరెక్టర్ గా కూడా అభయ్ నవీన్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. శ్రీకాంత్ అయ్యంగార్, విష్ణు, తాగుబోతు రమేష్, రోహిణి, ఆనంద్ చక్రపాణి మిగిలిన నటులు బాగానే చేశారు.
 
- పక్కా పల్లెటూరు నేపథ్యం కనుక ఆక్కడ పాత్రలు, వాతావరణం బాగున్నాయి.  కెమెరా పనితనం బాగుంది. మ్యూజిక్ లో తెలంగాణ ఫ్లేవర్ కనిపిస్తుంది. హీరో, దర్శకుడు కొత్త కాబట్టి. చిన్న లోపాలున్నా కనపడి కనపడకుండా కధను నడిపాడు. ఇక సినిమా ఓ సందేశం కోసం తీశారు. రాజకేయాల్లో యూత్ పోవుడు తప్పదు కాదు. ఎలాంటి నాయకుడితో ఉన్నాం అన్నదే అసలు మేటర్. ఆలోచించి తిరగండి. ఆవేశంతో కాదు అనేదే. సినిమా లోని నీతి. యువత  కచ్చితంగా చూడతగ్గ సినిమా ఇది. 
రేటింగ్: 2.5/5