దీప్తి సునైనా మళ్లీ ప్రేమలో పడిందా..? ఎవరతను?
యూట్యూబర్ దీప్తి సునైనా ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటుంది. 2021లో షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా విడిపోయిన సంగతి తెలిసిందే. బహుశా, దీప్తి సునైనా ప్రస్తుతం సింగిల్‌గా వుండవచ్చు. తాజాగా ఆమె ప్రేమలో వున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రేమ మనిషితో కాదండోయ్. దీప్తి సునైనా ఎవరి ప్రేమలో పడిందని త్వరలో పెళ్లి చేసుకుంటుందని అనుకుంటే పొరబడినట్టే. దీప్తి సునైనా కుక్కపిల్లపై ప్రేమతో వున్నట్లు ఇన్ స్టా ద్వారా తెలుస్తోంది.
తన కొత్త పెంపుడు జంతువుతో ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోకు "పాల్ ఇన్ లవ్ విత్ లెర్నింగ్" అని క్యాప్షన్ ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.