గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:50 IST)

"ఆర్ఎక్స్‌ 100" డైరెక్టర్‌తో ధనుష్ సినిమా.. కథ చెప్పమని పిలుపు

"ఆర్ఎక్స్‌ 100" డైరెక్టర్ అజయ్ భూపతికి ఓ స్టార్ హీరో నుండి కథ చెప్పమంటూ పిలుపొచ్చిందట. ఇంతకీ ఈ హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ ధనుష్‌. అనువాద చిత్రాలతో టాలీవుడ్‌లో తన కంటూ స్పెషల్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
 
అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ధనుష్‌.. అజయ్ భూపతితో సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇందుకోసం స్టోరీ చెప్పాల్సిందిగా భూపతికి కబురు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా "ఆర్ఎక్స్‌ 100" సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
ఈయన రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.