బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డివి
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (21:02 IST)

''రెడ్'' కోసం ‘డించక్ డించక్’ అంటూ స్టెప్పులేసిన హెబ్బా-రామ్ (వీడియో)

Ram_hebha Patel
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన ‘రెడ్’ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుమల కిశోర్ దర్శకత్వంలో శ్రీ  స్రవంతి మూవీస్పతాకంపై ‘స్రవంతి’ రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివేదా పేతురాజ్ , మాళవికాశర్మ, అమృతా అయ్యర్ ఇందులో కథానాయికలు. ‘ఇస్మార్ట్ శంకర్ ‘ తర్వాత రామ్ చేసినఈ సినిమా క్లాస్ నీ మాస్ నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు తిరుమల కిషోర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో రామ్,హెబ్బా పటేల్ పై చిత్రీకరించిన స్పెషల్ మాస్ సాంగ్ లిరికల్ వీడియోనుఈ రోజు సోషల్ మీడియాలో విడుదల చేశారు. 
 
ఈ సందర్బంగా నిర్మాత ‘స్రవంతి’రవి కిషోర్ మాట్లాడుతూ “సినిమాలో వచ్చే ఫస్ట్ సాంగ్ఇది. ప్రేక్షకుల  అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లోస్పెషల్ గా సెట్ వేసి 6 రోజులు భారీ నిర్మాణ వ్యయం తో ఈ పాట  చిత్రీకరించాం.”ఏయ్ డించక్ డించక్ డింక .. ఆడ ఈడ దూక కే  జింక ...డించ క్ డించ క్ డింక.. మా బీచ్ కిరావే ఇంక" అంటూ కాసర్ల శ్యామ్ రాయగా, సాకేత్, కీర్తనా శర్మ ఆలపించిన  ఈ పాటకు జా నీ మాస్టర్ నృత్య దర్శకత్వం చేశారు. దీంతో పాటు ఈ సినిమా లో పాటలన్నీ చాలాబాగుంటాయి. మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనవరి 14 నగ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం.” అని తెలిపారు.
 
నృత్య దర్శకుడు జానీ మాస్టర్ మాట్లాడుతూ “మార్చి నెలలో లాక్ డౌన్ కు ముందుచేసిన పాట ఇది. చాలా ఎనర్జిటిక్ సాంగ్ ఇది. ఈ పాట విషయంలో హీరో రామ్ కి స్పెషల్థాంక్స్ చెప్పుకోవాలి. ఈ పాట బాగా రావడానికి ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్  బాగా ఉపకరించాయి. పాట ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చింది. రామ్ తన స్టెప్స్‌తో ఇరగ దీసేశారు. హెబ్బా పటేల్‌కి ఇదే ఫస్ట్ టైమ్ స్పెషల్ సాంగ్ చేయడం. తను కూడా చాలా బాగాచేసింది. ఈ పాట బాగా రావడానికి బడ్జెట్ పరంగా  రవి కిషోర్ గారు ఫుల్ ఫ్రీడం ఇచ్చారు. మణి శర్మ ఎనర్జిటిక్ మ్యూజిక్ ఇచ్చారు. ముఖ్యంగా బీజియమ్స్ అదిరిపోయాయి. థియేటర్‌లలో ఈ పాట ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుంది.” అని చెప్పారు.
 
న‌టీన‌టులు:
రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌, నాజ‌ర్ తదితరులు 
సాంకేతిక నిపుణులు:
సంస్థ‌: శ్రీ స్ర‌వంతి మూవీస్‌, సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: పీటర్‌ హెయిన్స్, ఎడిటింగ్‌: జునైద్‌, సమర్పణ : కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్‌, దర్శకత్వం : కిశోర్‌ తిరుమల.