గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-12-2020 మంగళవారం దినఫలాలు - దత్తాత్రేయ స్వామిని ఆరాధించినా..

మేషం : ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పిత్రార్జన ఆస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఒంటరిగా ఏ పని చేయడం క్షేమంకాదని గమనించండి.
 
వృషభం : ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సమర్థంగా నడుపుతారు. తరచూ దేవాలయ సందర్శనం చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సిమెంట్, ఇసుక, వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు అదనపు సంపాదన దిశగా ఆలోచనలు సాగిస్తారు. 
 
మిథునం : రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. వ్యాపారాల్లో అనుభవం, ఆశించిన లాభాలు గడిస్తారు. మీ భర్తలో ఉన్నట్టుండి వేదాంత ధోరణి కానవస్తుంది. హోల్‌సేల్ వ్యాపారులు, రేషన్ డీలర్లు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. అకాల భోజనం వల్ల మీ ఆరోగ్యంలో ఇబ్బందులు తప్పవు. 
 
కర్కాటకం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. చేపట్టిన పనులలో నాణ్యతా లోపం వల్ల కాంట్రాక్టర్లు ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. 
 
సింహం : వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. స్త్రీలు, టీవీ కార్యక్రమాల్లో రాణిస్తారు. ప్రభుత్వ కార్యలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. మీ వాక్‌చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. 
 
కన్య : వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ మౌనం వహించడం మంచిది. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. ప్రేమికులకు తొందరపాటుతగదు. బంధువులతో అభిప్రాయభేదాలు, పట్టింపులు తలెత్తుతాయి. సామూహిక దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల : గృహోపకరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ విషయంలో కూడా మీకు సానుకూల వాతావరణం నెలకొనివుంటుంది. అనవసర విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఒక కార్య సాధన కోసం ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి ఉంటుంది. 
 
వృశ్చికం : రచయితలు, పత్రికా రంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సహం లభిస్తుంది. స్త్రీలు కళాత్మక పోటీల పట్ల ఆసక్తి చూపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి సత్ఫలితాలు సాధిస్తారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలం. కొత్త రుణాల కోస అన్వేషిస్తారు. 
 
ధనస్సు : పంతాలు పట్టింపులకు ఇది సమయం కాదు.  విదేశీ ప్రయాణ యత్నాలలో ఉన్నవారికి ఇది అనుకూలమైన కాలం. మీ మనోభావాలు బయటకి వ్యక్తం చేసి సమస్యలు తీర్చుకోగలుగుతారు. పనులు హడావుడిగా సాగుతాయి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. 
 
మకరం : ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశం తాత్కాలికమే అయినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. 
 
కుంభం : శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం. వ్యాపార విషయంగా ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. 
 
మీనం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులు అధిక ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలకు అనుకూలమైన కాలం. ఇతర వ్యాపకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ అభిరుచి, ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత చాలా అవసరం.