గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 30 డిశెంబరు 2020 (08:56 IST)

30-12-2020 బుధవారం దినఫలాలు - మహావిష్ణువును ఆరాధించినా పురోభివృద్ధి...

మేషం : ఒక స్థిరాస్తి విక్రయానికి అడ్డుంకులు తొలగిపోగలవు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కార్యసాధనకు మరింతగా శ్రమించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదు. 
 
వృషభం : బంధు మిత్రుల కలయికతో ఉత్సాహం చెందుతారు. స్థిరచర మూలక ధనం అందుతుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
మిథునం : వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు ఆడంబరాలు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపించుకుంటారు. కానివేళలో ఇతరులరాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాల్లో దాయాదుల తీరు ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు అధికమవుతాయి. 
 
కర్కాటకం : అనుక్షణం మీ సంతానం విద్యా, ఉద్యోగ విషయాలపైనే మీ ఆలోచనలుంటాయి. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌కు ఆటంకాలెదురవుతాయి. భాగస్వామిక్ చర్చల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయాలి. 
 
సింహం : ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలలో వారికి మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉండాలి. ప్రయాణం వాయిదా వేసుకోవడం ఉత్తమం. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. 
 
కన్య : శ్రమాధిక్యత, వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఉపాధి పథకాలపై నిరుద్యోగులు దృష్టిపెడతారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలే జరుగుతుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, పనియందు అంకితభావం అవసరం. విద్యార్థినుల ఒత్తిడి, చికాకులకు గురవుతారు. 
 
తుల : బ్యాంకు పనులు, దూర ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. వాతావరణంలో మార్పువల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం శ్రేయస్కరం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసచారాలు తెలుసుకుంటారు. అందరితో సఖ్యతగా మెలుగుతూ ఉల్లాసంగా గడుపుతారు. 
 
వృశ్చికం : ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతాయి. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతాయి. పెద్ద హోదాలో ఉన్న వారికి అధిరాకి పర్యటనలు అధికమవుతాయి. 
 
ధనస్సు : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు చురుకుతనం, పనియందు ధ్యాస చాలా అవసరం. కూర, పండ్లు, కొబ్బరి, ధాన్య, స్టాకిస్టులకు కలిసివచ్చే కాలం. ప్రైవేటు సంస్థలలోని వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. 
 
మకరం : హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటాయి. ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. దైవ, సేవా పుణ్యకార్యాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
కుంభం : పెద్దమొత్తం సరకు నిల్వలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన తేలవు. రుణాల కోసం అన్వేషిస్తారు. రాజకీయ నాయకులకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చు తప్పుల వల్ల మాటపడతారు. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది.
 
మీనం : మీ సంతానం కదలికలపై దృష్టిసారించండి. మీ చెంత ధనం ఉందన్న విషయాన్ని గోప్యంగా ఉంచండి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు చురుకుగా సాగుతాయి. పనివారితో ఇబ్బందులు తప్పవు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. వైద్యులకు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తిచేస్తారు.