పార్వతీశం, జష్విక నటించిన తెలుసా మనసా టీంను అభినందించిన డైరెక్టర్ బాబీ
Parvatheesham, Jasvika
మంగళవారం ఈ సినిమా నుంచి మనసు మనసుతో.. అనే మెలోడి సాంగ్ విడుదలైంది. వాల్తేరు వీరయ్యతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు బాబీ కొల్లి ఈ పాటను విడుదల చేసి.. సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోసారి ఈ పాటలో ఆయన తనదైన మార్క్ చూపించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా.. నిజమైన ప్రేమలోని లోతును ఆవిష్కరించేలా, హృదయానికి హత్తుకునేలా మనసు మనసుతో పాట ఉంది. వనమాలి రాసిన ఈ పాటను శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది.
డెబ్యూ డైరెక్టర్ వైభవ్ .. తెలుసా మనసా.. చిత్రాన్ని న్యూ ఏజ్ లవ్‌స్టోరిగా అద్భుతంగా మలుస్తున్నారని త్వరలోనే మరిన్ని విషయాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
నటీనటులు:
పార్వతీశం, జశ్విక, రోహిణి హట్టంగడి, మహేష్ అచంట, అలీ రెజా, లావణ్య, మాస్టర్ అద్వితేజ్, వెంకీ, శివ, శోభన్ తదితరులు
తర్వాతి కథనం
