ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (12:56 IST)

మే డే నాడు సింగరేణి జంగ్ సైరెన్ మోగించనున్న డైరెక్టర్ జీవన్ రెడ్డి

singareni title look
singareni title look
జార్జ్ రెడ్డి సినిమా ఫేం డైరెక్టర్ జీవన్ రెడ్డి రాసిన కథతో తెరకెక్కనున్న కొత్త సినిమా “సింగరేణి జంగ్ సైరెన్”. ది అండర్ గ్రౌండ్ లైవ్స్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ధూమ్ర వారాహి బ్యానర్ పై నూతన దర్శకుడు వివేక్ ఇనుగుర్తి  రూపొందించనున్నారు. 1999 లో సింగరేణిలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 
 
ఈ సర్వైవల్ డ్రామా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే “సింగరేణి జంగ్ సైరెన్” సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలు ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడే రోజున ప్రకటించనున్నారు. తెలంగాణ నేపథ్య సినిమాలు మంచి ఆదరణ పొందుతున్న ఈ టైమ్ లో పక్కా తెలంగాణ నేటివ్ మూవీగా “సింగరేణి జంగ్ సైరెన్” సినిమాను పిక్చరైజ్ చేయనున్నారు.