మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 జులై 2017 (16:36 IST)

నా కుమార్తె శరీర కష్టాన్ని నమ్ముకుంది... డ్రగ్స్‌కు బానిస కాదు : చార్మీ తండ్రి

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో సినీ నటి చార్మీ కౌర్ పేరు రావడంపై ఆమె తండ్రి దీప్ సింగ్ ఉప్పల్ స్పందించారు. తన కూతురుకు డ్రగ్స్‌ వాడే అలవాటు లేదని, మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆర

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో సినీ నటి చార్మీ కౌర్ పేరు రావడంపై ఆమె తండ్రి దీప్ సింగ్ ఉప్పల్ స్పందించారు. తన కూతురుకు డ్రగ్స్‌ వాడే అలవాటు లేదని, మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆరోపిస్తున్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ 13 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేసి చార్మీ... ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చింది. నా కూతురు కష్టాన్ని నమ్ముకుంది. నాకు నా కూతురు గురించి బాగా తెలుసు. ఆమె ఎంతో హార్డ్‌ వర్కర్‌. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే ఆమె ఈ స్థాయికి వచ్చుండేది కాదన్నారు. 
 
నా కూతురు డ్రగ్స్‌ వాడుతున్నట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధం. ఏదైనా రాసేముందు ఆయా వ్యక్తులకు కుటుంబాలు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోండి. ఈ వార్తల కారణంగా నా భార్య ఎంతో డిస్ట్రబ్‌ అయింది. తన కూతురిపై వచ్చిన ఆరోపణలతో ఆమె గుండె బద్దలైపోయిందని ఆయన అన్నారు. 
 
కాగా, డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారం టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలోని కొంతమంది ప్రముఖ నటులు డ్రగ్స్‌ వాడుతున్నారని బయటకు రావడంతో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యవహారంలో హీరోయిన్‌ ఛార్మికి కూడా తెలంగాణ ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈమె గురువారం విచారణకు హాజరుకానుంది.