శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (16:35 IST)

బిగ్​బాస్​ సీజన్​ 7లో ఫ్యామిలీ టైమ్.. శివాజీకి సర్ ప్రైజ్

sivaji
బిగ్​బాస్​ సీజన్​ 7లో ఫ్యామిలీ టైమ్ వచ్చేసింది. ఈ వారం కంటెస్టెంట్ల ఫ్యామిలీని బిగ్​బాస్​ హౌజ్​లోకి పంపిస్తున్నారు. దానికి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ అయింది. చాలా ఎమోషనల్​గా ఈ ప్రోమో సాగింది.
 
నిన్నంతా నామినేషన్ల లొల్లిలో హీట్​లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్​బాస్ చల్లని కబురును ఫ్యామిలీ రూపంలో తీసుకొచ్చారు. ప్రశాంత్, యావర్​తో కూర్చొని శివాజీ ఛాయ్​ తాగుతుండగా బిగ్​బాస్​ డాక్టర్​ రూమ్​కి రావాలని పిలిచారు. 
 
దాంతో రెగ్యూలర్​ చెకప్​ కోసం అనుకుంటూ.. శివాజీ లోపలికి వెళ్లారు. హాథ్ కైసా అని డాక్టర్​ ప్రశ్నించగా.. యా గుడ్ ఫీలింగ్ బెటర్​ అని శివాజీ తెలిపారు. వ్యాయామాలు టైమ్​కి చేస్తున్నారా? అని భుజానికి సంబంధించి అన్ని ప్రశ్నలు అడిగారు. ఇంకో మూడు రోజుల్లో ఇది తగ్గిపోతుందని చెప్పగా.. తగ్గాలని కోరుకుంటున్నాను. 
 
గేమ్​లో మరింత బాగా ఆడాలనుకుంటున్నా అని చెప్పి వెళ్లిపోతుండగా.. నాన్న అంటూ పిలిచి.. ఫేస్​కున్న మాస్క్​ను.. తలపై మాస్క్​ను తీసి శివాజీ కొడుకు సర్​ఫ్రైజ్ చేశారు. కొడుకును చూసిన సంతోషంలో శివాజీ బాగా ఎమోషనల్​ అయిపోయాడు. కన్నీటి పర్యంతమైపోయాడు.  
 
తర్వాత కొడుకుతో ప్రైవేట్​గా కూర్చొని శివాజీ మాట్లాడారు. కొడుకును చూసిన శివాజీ కన్నీటి పర్యంతమయ్యాడు. నువ్వు ఏడ్వకు నాన్న.. నువ్వు ఏడిస్తే ఇంట్లో అందరూ ఏడుస్తారు. నువ్వు నవ్వితే ఇంట్లో అందరూ నవ్వుతారు. నువ్వు ఏడిస్తే అందరూ ఏడుస్తారని ఎమోషనల్​ అవ్వగా.. ప్రోమో ముగుస్తుంది.