వరద బాధితులకు బాటిళ్లు, ఆహారాన్ని పంపిణీ చేసిన.విజయదేవర కొండ అభిమానులు
రెండు తెలుగు రాష్ట్రాలలో వాయుగుండంతో వరదల భీబత్సం తెలిసిందే. ఇందుకు సెలబ్రిటీలో తలో చేయి వేసి బాధితులకు సాయం అందిస్తున్నారు. అగ్ర హీరోలు కోట్లు, లక్షల్లో సాయం చేస్తుండగా, మరికొందరు తమ అభిమానులతో సేవ చేయిస్తున్నారు. ఆ కోవలో విజయ్ దేవరకొండ అభిమానులు సహాయక చర్యలకు సహకరించడానికి రంగంలోకి దిగారు.
విజయవాడలోని అభిమానులు 800 మందికి పైగా బాధితులకు వాటర్ బాటిళ్లు, పరిశుభ్రమైన ఆహారాన్ని పంపిణీ చేశారు. రోడ్లపై మోకాలి లోతు వున్న నీళ్ళలో సైతం వారంతా ఇంటింటికి వెళ్ళి బాధితులకు అందజేశారు. ఈ విషయాన్ని దేవరకొండ తెలియజేస్తూ, ప్రజలకు ఎటువంటి సాయం కావాలన్నా ముందుంటానని ఇందుకు నా అభిమానులు చేస్తున్న సేవకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.