శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (16:54 IST)

'ఏ మాయ చేసావే' సీక్వెల్... భార్యాభర్తలే హీరోహీరోయిన్లుగా...

2010లో వచ్చిన చిత్రం "ఏ మాయ చేసావే". గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా, అక్కినేని నాగచైతన్య సినీ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది.

2010లో వచ్చిన చిత్రం "ఏ మాయ చేసావే". గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా, అక్కినేని నాగచైతన్య సినీ కెరీర్‌లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది. అతని కెరీర్‌కు మంచి బ్రేక్ కూడా ఇచ్చింది. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించింది. ఈ ఎనిమిదేళ్ళ కాల చక్రంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. హీరోహీరోయిన్లుగా ఉన్న నాగ్ - సామ్‌లు కాస్త ఇపుడు భార్యాభార్తలుగా మారిపోయారు.
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రం సీక్వెల్‌ తీయాలన్న ఆలోచనలో దర్శకుడు గౌతమ్ రెఢీ అవుతున్నాడనేది ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇదే సినిమాను ఆయన తమిళంలో శింబు.. త్రిష జంటగా చేశాడు. తమిళ సీక్వెల్‌కి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక తెలుగు సీక్వెల్‌కి చైతూ ఓకే చెప్పాల్సి ఉందని సమాచారం. ఇక కథానాయికల విషయంలోనూ స్పష్టత రావలసి వుంది. చై ఓకే చెప్పిన పక్షంలో హీరోయిన్‌గా సమంతకే ఛాన్సివ్వాలన్న ఆలోచనలో గౌతమ్ మీనన్ ఉన్నట్టు తెలుస్తోంది.