మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Mohan
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (20:38 IST)

రంగమ్మా మంగమ్మా నెట్టింట్లో చిందేస్తోంది...

తెలుగు సినిమాల్లో పాటల ప్రాధాన్యత ఏమో గానీ సోషల్ మీడియాల ద్వారా మరీ ఎక్కువ హిట్లు వస్తున్నాయి. తెలుగు సినిమాలలో పాటలకు ప్రాధాన్యం చాలా ఎక్కువనే చెప్పాలి. ఒకప్పుడు శంకరాభరణం, సప్తపది వంటి సంగీత సాహిత్య

తెలుగు సినిమాల్లో పాటల ప్రాధాన్యత ఏమో గానీ సోషల్ మీడియాల ద్వారా మరీ ఎక్కువ హిట్లు వస్తున్నాయి. తెలుగు సినిమాలలో పాటలకు ప్రాధాన్యం చాలా ఎక్కువనే చెప్పాలి. ఒకప్పుడు శంకరాభరణం, సప్తపది వంటి సంగీత సాహిత్య ప్రాధాన్యంగా వచ్చిన చిత్రాలు సైతం సిల్వర్ జూబ్లీలు జరుపుకునేంతలా చిత్రాలను రూపొందించారు. అయితే కాలగమనంలో ప్రేక్షకులు పాశ్చాత్య సంగీతానికి, కొత్త స్టెప్పులకు అలవాటు పడిపోయారు. అంతేకాకుండా పాటలలో సంగీతానికి ప్రాధాన్యం పెరిగింది కానీ అది సాహిత్యాన్ని మింగేసే పరిస్థితికి వచ్చింది. 
 
మరికొన్ని చిత్రాలు పాటలు లేకుండానే రిలీజైయ్యాయి. అయితే ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల అభిరుచులు మారాయో ఏమో గానీ, గత 2 సంవత్సరాలలో వచ్చిన తెలుగు సినిమా పాటల్లో ఎక్కువ శాతం యూట్యూబ్‌లో హిట్‌లుగా నిలవడానికి కారణం మాత్రం సంగీతంతో పాటు ఇంపైన సాహిత్యమే కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
 
ఉదాహరణకు గతేడాది వచ్చిన ఫిదా చిత్రంలోని వచ్చిండే.. పాట ఇప్పటికే 15 కోట్ల హిట్స్‌తో తెలుగు యూట్యూబ్ రికార్డ్‌ల్లో మొదటి స్థానంలో నిలిచింది. బాహుబలి చిత్రంలోని సాహోరే బాహుబలి పాట 125 కోట్ల వ్యూస్‌ను కలిగి ఉంది. ఈ ఏడాది వచ్చిన రంగస్థలం చిత్రంలోని రంగమ్మ మంగమ్మ సాంగ్ 10 కోట్లు హిట్స్‌తో నిలవగా, ఛలో సినిమాలోని చూసి చూడంగానే పాట యువతకు మరింత బాగా నచ్చేసింది. ఈ పాట 8 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకోగా, తాజాగా విజయ్‌ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రంలో ఇంకేం ఇంకేం కావాలే పాట అయితే సినిమాను మరో స్థాయిలో నిలబెట్టిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 
 
ఇక్కడ ఉన్న పాటలు సినిమాలో సందర్భానుసారం వచ్చినప్పటికీ అందులోని సాహిత్యం ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా రాయడంలో గేయ రచయితలు విజయం సాధించారు. అందులోనూ సోషల్ మీడియా పుణ్యమా అని అలా వచ్చిన పాటలను యూత్ మరింత ట్రోల్ చేస్తూ వాటికి మరింత ప్రచారాన్ని కల్పిస్తూ ఉండటమే కాకుండా సంగీతంతో పాటుగా సాహిత్యాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు.